తోటకూర రాగి వడలు

ABN , First Publish Date - 2015-09-05T17:21:44+05:30 IST

కావలసిన పదార్థాలు : రాగిపిండి - 1 కప్పు, బియ్యప్పిండి - 1 టేబుల్‌ స్పూను, తోటకూర తరుగు

తోటకూర రాగి వడలు

కావలసిన పదార్థాలు : రాగిపిండి - 1 కప్పు, బియ్యప్పిండి - 1 టేబుల్‌ స్పూను, తోటకూర తరుగు - అర కప్పు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉల్లి తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా, శనగపప్పు - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: శనగపప్పుని గంటపాటు నానబెట్టాలి. ఒక వెడల్పాటి పాత్రలో రాగిపిండి, బియ్యప్పిండి, తోటకూర, కొత్తిమీర, ఉల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, శనగపప్పు వేసి 1 టేబుల్‌ స్పూను నీటితో ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేత్తో వత్తుతూ నూనెలో దోరగా వేగించాలి. ఈ వడలు కొబ్బరి చట్నీతో చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-05T17:21:44+05:30 IST