శనగరోల్స్‌ కూర

ABN , First Publish Date - 2015-09-04T16:28:41+05:30 IST

కావలసిన వస్తువులు: శనగపిండి - 250 గ్రా, కారం - 2 టీ స్పూన్లు, జీలకర్ర - 1 టీ స్పూను

శనగరోల్స్‌ కూర

కావలసిన వస్తువులు: శనగపిండి - 250 గ్రా, కారం - 2 టీ స్పూన్లు, జీలకర్ర - 1 టీ స్పూను, ధనియాల పొడి - 2 టీ స్పూన్లు, ఇంగువ - చిటికెడు, గరం మసాల పొడి - అర స్పూను, పసుపు - 1 టీ స్పూను, చిలికిన మజ్జిగ - 1 కప్పు, పచ్చిమిర్చి - 2 లేక 3, కొత్తిమీర - ఒక కట్ట, రుచికి - ఉప్పు, తగినంత నూనె.
తయారుచేసే విధానం
శనగపిండిలో ఒక స్పూను కారం, గరం మసాల పొడి, ఉప్పు, రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. దళసరి చపాతీలా తయారుచేసి పొడుగ్గా అంగుళం వెడల్పున కట్‌ చేసుకుని రోల్స్‌లా చుట్టుకోవాలి. తర్వాత వేడి నీటిలో ఉడికించాలి. అవి గట్టిపడి, తెల్లగయ్యేదాకా ఉంచి తీసి ఒక పక్కనుంచాలి. కడాయిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, తక్కిన దినుసులు వేసి వేగాక మజ్జిగ పోసి, మరో కప్పు నీటిని కూడా కలిపి 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇపడు శనగపిండి రోల్స్‌ను వేసి మరో నిమిషం పాటు ఉడికించి దించాలి. కొత్తిమీరను అలంకరించి వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-04T16:28:41+05:30 IST