షాహీ పనీర్‌

ABN , First Publish Date - 2015-09-04T16:31:27+05:30 IST

కావలసిన పదార్థాలు: పనీర్‌ (క్యూబ్స్‌) - 200 గ్రా., టమోటాలు - 3, ఉల్లిపాయలు - 2, నూనె - 2 రెండు

షాహీ పనీర్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌ (క్యూబ్స్‌) - 200 గ్రా., టమోటాలు - 3, ఉల్లిపాయలు - 2, నూనె - 2 రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు, జీడిపప్పు పేస్టు - 2 టేబుల్‌ స్పూన్లు, దనియాల పొడి - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, జీలకర్ర పొడి - అర టీ స్పూను, కారం - పావు టీ స్పూను, క్రీమ్‌ - అరకప్పు, గరం మసాల - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర - అలంకరణకు.
తయారుచేసే విధానం: పనీర్‌ను నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో ఉల్లి తరుగు, అల్లం వెలుల్లి పేస్టు వేగించాలి. తర్వాత టమోటా గుజ్జు, జీరా, దనియా, కారం, పసుపు, గరం మసాల, ఉప్పు వేసి చిన్నమంటపై 5 నిమిషాలు ఉంచి జీడిపప్పు పేస్టు కలపాలి. అప్పుడు పనీర్‌ క్యూబ్స్‌తో పాటు కొద్దినీరు పోసి ఉడికించాలి. దించేముందు క్రీమ్‌ చల్లి కొత్తిమీరతో అలంకరించాలి. 

Updated Date - 2015-09-04T16:31:27+05:30 IST