పనీర్‌ టిక్కా మసాల

ABN , First Publish Date - 2015-09-03T22:25:34+05:30 IST

కావలసిన పదార్థాలు: పనీర్‌ క్యూబ్స్‌ - 1 కప్పు, అల్లం రసం - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు, మిరియాల పొడి

పనీర్‌ టిక్కా మసాల

కావలసిన పదార్థాలు: పనీర్‌ క్యూబ్స్‌ - 1 కప్పు, అల్లం రసం - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత, పెరుగు - 1 టేబుల్‌ స్పూను, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, టమోటాలు - 3, పచ్చిమిర్చి -1, జీలకర్ర - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు, బిర్యాని ఆకు - 1, దనియాల పొడి, కాశ్మీరీ కారం - 1 టీ స్పూను చొప్పున, పసుపు - పావు టీ స్పూను, పంచదార - అర టీ స్పూను, మొక్కజొన్న పిండి - 1 టీ స్పూను, కొత్తిమీర - 1 కట్ట, గరం మసాల - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: పనీర్‌కు అల్లం రసం, ఉప్పు, పెరుగు, మిరియాల పొడి పట్టించి గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. టమోటాలు, పచ్చిమిర్చి కలిపి పేస్టు చేసుకోవాలి. కొద్ది నీటిలో మొక్కజొన్న పిండి జారుగా కలపాలి. ఫ్రిజ్‌ నుండి తీసిన పనీర్‌ గది ఉష్ణోగ్రతకు వచ్చాక చిన్నమంటపై దోరగా వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఇంగువ, బిర్యాని ఆకు, టమోటా గుజ్జు, దనియాలపొడి, పసుపు, కారం, పంచదారను 4 నిమిషాల సేపు వేగించాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండి జారు వేసి చిక్కబడ్డాక పనీర్‌ ముక్కలు వెయ్యాలి. 3 నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు, గరం మసాల కలిపి దించెయ్యాలి. ఈ మసాల కూర బ్రెడ్‌/ అన్నంతో బాగుంటుంది.

Updated Date - 2015-09-03T22:25:34+05:30 IST