పాలక్‌ పనీర్‌ కోఫ్తా కర్రీ

ABN , First Publish Date - 2015-09-03T21:25:43+05:30 IST

కావలసిన పదార్థాలు: పనీర్‌ - ఒకటిన్నర కప్పు, పాలకూర - 2 కట్టలు, పచ్చిమిర్చి - 3, అల్లం

పాలక్‌ పనీర్‌ కోఫ్తా కర్రీ

కావలసిన పదార్థాలు: పనీర్‌ - ఒకటిన్నర కప్పు, పాలకూర - 2 కట్టలు, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం ముక్క, జీలకర్ర - 1 టీ స్పూను, వాము, గరం మసాల, పసుపు - అర టీ స్పూను చొప్పున, శనగపిండి - 2 టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
 
గ్రేవీ కోసం : ఉల్లిపాయ - 1, టమోటాలు - 3, వెల్లుల్లి - 4 రేకలు, అల్లం - అంగుళం ముక్క, కారం - ముప్పావు టీ స్పూను, జీరాపొడి - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఎండు మెంతికూర - 1 టీ స్పూను, బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారుచేసే విధానం: కూరగాయల్ని సన్నగా తరిగాక - ఒక పళ్లెంలో పనీర్‌, పాలకూర, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, పసుపు, గరం మసాల, ఉప్పు, బియ్యప్పిండి, శనగపిండి, వాము (అవసరమైతే నీరు చిలకరించి) బాగా కలిపి, నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోని, నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. ఇప్పుడు ఉల్లి, అల్లం, వెల్లుల్లి, టమోటాలు పచ్చివాసన పోయేవరకు వేగించి, చల్లారిన తర్వాత మిక్సీలో రుబ్బుకోవాలి. ఆ గుజ్జును బటర్‌లో 5 నిమిషాలపాటు ఉడికించి కారం, దనియా, జీరా, గరం మసాల పొడులు, పసుపు, ఇంగువ, ఎండు మెంతికూర, ఉప్పు, కొద్ది నీరు కలిపి గ్రేవీ చిక్కబడ్డాక పనీర్‌ ఉండలు వేయాలి. అన్నంతో/ బ్రెడ్‌తో ఎంతో రుచిగా ఉండే కూర ఇది.

Updated Date - 2015-09-03T21:25:43+05:30 IST