దహీ బేంగన్‌

ABN , First Publish Date - 2015-09-03T16:34:01+05:30 IST

కావలసిన పదార్థాలు: వంకాయలు - 200 గ్రా., పెరుగు - పావు కిలో, శనగపిండి - 50 గ్రా., ఉప్పు - రుచికి తగినంత

దహీ బేంగన్‌

కావలసిన పదార్థాలు: వంకాయలు - 200 గ్రా., పెరుగు - పావు కిలో, శనగపిండి - 50 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, ఆవాలు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - పావు టీ స్పూను, ఎండు మిర్చి - 2, కారం - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: వంకాయల్ని పొడుగ్గా తరగాలి. శనగపిండిలో చిటికెడు ఉప్పు, కారం వేసి బజ్జీల పిండిలా కలపాలి. ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. తర్వాత పెరుగు, ఉప్పు కలిపిన పాత్రలో ముక్కల్ని వేయాలి. ఇప్పుడు తాలింపును ముక్కల పెరుగులో కలపాలి. ఈ కర్రీ రోటీతో బాగుంటుంది.

Updated Date - 2015-09-03T16:34:01+05:30 IST