గుమ్మడికాయ, కొబ్బరిపాల కూర

ABN , First Publish Date - 2015-09-03T17:12:53+05:30 IST

కావలసిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు - 2 కప్పులు, బియ్యం - రెండు టేబుల్‌ స్పూన్లు, కొబ్బరి తురుము

గుమ్మడికాయ, కొబ్బరిపాల కూర

కావలసిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు - 2 కప్పులు, బియ్యం - రెండు టేబుల్‌ స్పూన్లు, కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉల్లి తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, మెంతులు, పసుపు - అర టీ స్పూను చొప్పున, కారం - 1 టీ స్పూను, కూర పొడి - 1 టీ స్పూను, దాల్చినచెక్క - అంగుళం ముక్క, వెలుల్లి తరుగు - 1 టేబుల్‌ స్పూను, కొబ్బరి పాలు - 1 కప్పు, ఆవపొడి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: బియ్యం, కొబ్బరి తురుము వేగించి చల్లారాక పొడి చేసి కొబ్బరిపాలలో కలిపి పక్కనుంచాలి. నూనెలో మెంతులు, ఉల్లి, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, దాల్చినచెక్క, కారం, కూరపొడి, పసుపు ఒకటి తర్వాత ఒకటి వేగించి గుమ్మడి ముక్కలు వేసి ఉప్పు, కప్పు నీరు కలిపి మూత పెట్టాలి. ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరి పాల మిశ్రమం, ఆవపిండి కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. ఈ కూర వేడి వేడి అన్నంలో బాగుంటుంది.

Updated Date - 2015-09-03T17:12:53+05:30 IST