చుక్కకూర చిలకడదుంప

ABN , First Publish Date - 2015-09-03T16:26:52+05:30 IST

కావలసిన పదార్థాలు: చిలకడదుంప ముక్కలు - పావు కప్పు, చుక్కకూర పేస్టు - ఒక కప్పు, ఉల్లిపాయ

చుక్కకూర చిలకడదుంప

కావలసిన పదార్థాలు: చిలకడదుంప ముక్కలు - పావు కప్పు, చుక్కకూర పేస్టు - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, ఉప్పు - రుచికి తగినంత, కారం - ఒక టీస్పూను, పసుపు - చిటికెడు, జీలకర్ర పొడి - ఒక టీస్పూను, ధనియాల పొడి - ఒక టీస్పూను, కొత్తిమీర - కొద్దిగా, నూనె - మూడు టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: చిలకడ దుంపలు చిన్న ముక్కలుగా కోసి నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దోరగా వేగించి అందులో చుక్కకూర పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి వేగిన తర్వాత ఉడికించిన చిలకడ దుంపముక్కలను వేసి కొద్దిగా నీళ్లు పోసి కూర దగ్గర పడ్డాక కొత్తిమీర చల్లి దించుకోవాలి.

Updated Date - 2015-09-03T16:26:52+05:30 IST