చుక్కకూర వంకాయ

ABN , First Publish Date - 2015-09-03T16:31:09+05:30 IST

కావలసిన పదార్థాలు: (లేత)వంకాయలు - అరకిలో, చుక్కకూర తరుగు - 2 కప్పులు, పచ్చిమిర్చి ముద్ద

చుక్కకూర వంకాయ

కావలసిన పదార్థాలు: (లేత)వంకాయలు - అరకిలో, చుక్కకూర తరుగు - 2 కప్పులు, పచ్చిమిర్చి ముద్ద - అర టీ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉల్లిపాయ - 1, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు + జీలకర్ర + మినప్పప్పు - 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను. పసుపు - చిటికెడు.
తయారుచేసే విధానం: కడాయిలో తాలింపు గింజల్ని, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టుల్ని, ఉల్లి తరుగు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వేగనివ్వాలి. తర్వాత పొడుగ్గా తరిగిన వంకాయముక్కలు, పసుపు వేసి రెండు నిమిషాలు వేగించి మూత పెట్టి సన్నని మంటపైన మగ్గనివ్వాలి. ముప్పావు వంతు వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఉప్పు, చుక్కకూర తరుగు వేసి కలబెట్టి మూతపెట్టాలి. మరో 5 నిమిషాలుంచి దించేయాలి. ఈ కూర అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-03T16:31:09+05:30 IST