అరటి కాయ పొడి

ABN , First Publish Date - 2015-08-29T23:44:19+05:30 IST

కావలసిన పదార్థాలు: (కూర) అరటి కాయలు - (చిన్నవి) 2, దనియాలు, శనగపప్పు, నూనె - 1 టేబుల్‌ స్పూను చొప్పున

అరటి కాయ పొడి

కావలసిన పదార్థాలు: (కూర) అరటి కాయలు - (చిన్నవి) 2, దనియాలు, శనగపప్పు, నూనె - 1 టేబుల్‌ స్పూను చొప్పున, మినప్పప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి - 8, చింతపండు - 2 రెబ్బలు, వెల్లుల్లి రేకులు - 4, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: తొక్కతీసిన అరటి కాయల్ని గుండ్రంగా, సన్నగా తరిగి, టీ స్పూను నూనెలో పళపళ మనేలా దోరగా వేగించాలి. రెండు టీ స్పూన్ల నూనెలో దనియాలు, శనగపప్పు, మినప్పప్పులను విడివిడిగా వేగించాలి. చివర్లో ఎండుమిర్చి కూడా వేసి వేగించి చల్లారిన తర్వాత అన్నీ కలిపి చింతపండు, ఉప్పు, వెల్లుల్లి చేర్చి బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. 

Updated Date - 2015-08-29T23:44:19+05:30 IST