వంకాయ మామిడి కాయ పప్పు

ABN , First Publish Date - 2015-08-30T20:47:21+05:30 IST

కావలసిన పదార్థాలు: వంకాయలు - 2, చిన్న మామిడికాయ - 1, కందిపప్పు - అరకప్పు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 5,

వంకాయ మామిడి కాయ పప్పు

కావలసిన పదార్థాలు: వంకాయలు - 2, చిన్న మామిడికాయ - 1, కందిపప్పు - అరకప్పు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 5, వెల్లుల్లి రేకలు - 5, పసుపు - పావు టీ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, తాలింపు కోసం - నెయ్యి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ తగిన మోతాదులో.
తయారుచేసే విధానం: వంకాయల్ని, మామిడికాయను నాలుగేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. నూనెలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లి, తరిగిన వంకాయ, మామిడి ముక్కలు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించి, ముక్కలు మగ్గిన తర్వాత మంట తీసేయాలి. పప్పులో పసుపు వేసి వేరుగా ఉడికించి, ఉప్పు, వంకాయ మిశ్రమంలో కలిపి నెయ్యి తో తాలింపు పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంతో కలిపి తింటే కమ్మగా ఉంటుంది.

Updated Date - 2015-08-30T20:47:21+05:30 IST