కడాయి పనీర్‌ ఫ్రై

ABN , First Publish Date - 2015-09-03T17:44:58+05:30 IST

కావలసిన పదార్థాలు: పనీర్‌ క్యూబ్స్‌ - 1 కప్పు, టమోటా తరుగు - 2 కప్పులు, క్యాప్సికం - 1, ఎండుమిర్చి

కడాయి పనీర్‌ ఫ్రై

కావలసిన పదార్థాలు: పనీర్‌ క్యూబ్స్‌ - 1 కప్పు, టమోటా తరుగు - 2 కప్పులు, క్యాప్సికం - 1, ఎండుమిర్చి - 5, దనియాలు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, అల్లం తరుగు - 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు - అరకప్పు, నూనె - 1 టేబుల్‌ స్పూను, కసూరీ మేతీ - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: క్యాప్సికం సన్నగా నిలువు ముక్కలుగా తరగాలి. కడాయిలో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక, టమోటా తరుగు కలపాలి. అవి మెత్తబడ్డాక వేగించి, బరకగా మిక్సీ దంచిన ఎండుమిర్చి+ దనియాల పొడి కలపాలి. రెండు నిమిషాల తర్వాత క్యాప్సికం ముక్కలు వేసి అవి సగం ఉడికాక గరం మసాల, ఉప్పు కలిపి పనీర్‌ క్యూబ్స్‌ చల్లాలి. 5 నిమిషాల తర్వాత అల్లం, కొత్తిమీర, కసూరి మేతీ కలిపి దించెయ్యాలి. ఈ కడాయి పనీర్‌ కర్రీ పరాటాలతో బాగుంటుంది.

Updated Date - 2015-09-03T17:44:58+05:30 IST