కాబూలీ శనగల పాలక్‌ చోళీ

ABN , First Publish Date - 2015-09-03T17:42:17+05:30 IST

కావలసిన పదార్థాలు: (ఉడికించిన) కాబూలీ శనగలు - 2 కప్పులు, పాలకూర తరుగు - 2 కప్పులు

కాబూలీ శనగల పాలక్‌ చోళీ

కావలసిన పదార్థాలు: (ఉడికించిన) కాబూలీ శనగలు - 2 కప్పులు, పాలకూర తరుగు - 2 కప్పులు, బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి తరుగు - 1 కప్పు, వెల్లుల్లి - 3 రేకలు, అల్లం తురుము - 1 టేబుల్‌ స్పూను, చోళే మసాల పొడి (మార్కెట్లో దొరుకుతుంది) - 1 టేబుల్‌ స్పూను, టమోటా - 1, బిర్యానీ ఆకులు - 2, మిరియాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, గరం మసాలా - 1 టీ స్పూను, క్రీమ్‌ - పావు కప్పు.
తయారుచేసే విధానం: అరకప్పు నీటిలో పాలకూర 3 నిమిషాలు ఉడికించి పక్కనుంచాలి. బటర్‌లో ఉల్లి, అల్లం, వెల్లుల్లి తరుగు వేగించి, చోళే మసాల, టమోటాలు, బిర్యాని ఆకులు, మిరియాలపొడి, ఉప్పు కలపాలి. టమోటాలు మెత్తబడ్డాక పాలకూర, శనగలు వేసి అరకప్పు నీరు, గరం మసాల వేసి (మూత పెట్టకుండా) 5 నిమిషాలు చిన్నమంటపై ఉడికించాలి. దించేముందు క్రీమ్‌ వేయాలి. వేడి వేడి అన్నం, పరాటాలతో తింటే మంచి కాంబినేషన్‌.

Updated Date - 2015-09-03T17:42:17+05:30 IST