గోరుచిక్కుడు పెరుగు కూర

ABN , First Publish Date - 2015-09-03T17:10:19+05:30 IST

కావలసిన పదార్థాలు: గోరుచిక్కుడు తరుగు - 2 కప్పులు, పెరుగు - 1 కప్పు, ధనియాలపొడి

గోరుచిక్కుడు పెరుగు కూర

కావలసిన పదార్థాలు: గోరుచిక్కుడు తరుగు - 2 కప్పులు, పెరుగు - 1 కప్పు, ధనియాలపొడి - 2 టీ స్పూన్లు, కారం - అర టీ స్పూను, శనగపిండి - 2 టీ స్పూను, ఇంగువ - చిటికెడు, కరివేపావు - 4 రెబ్బలు, మినప్పప్పు + ఆవాలు + జీలకర్ర + మెంతులు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను, కొత్తిమీర తరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం: గోరుచిక్కుడు తరుగుని ఉడికించి నీరు వార్చి పక్కనుంచాలి. ఒక పాత్రలో పెరుగు, ధనియాలపొడి, కారం, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేగించి పెరుగు మిశ్రమం కలిపి, 1 కప్పు నీరు చేర్చి 5 నిమిషాలు ఉడికించాలి. గోరుచిక్కుడు తరుగు వేసి మరో 3 నిమిషాలు ఉడికించి కొత్తిమీర కలిపి దించేయాలి. ఈ కూర పరాటాలతో, చపాతీలతో చాలా రుచిగా ఉంటుంది - అన్నంలో కలుపుకుంటే బాగోదు.

Updated Date - 2015-09-03T17:10:19+05:30 IST