గోరుచిక్కుడు కైమా

ABN , First Publish Date - 2015-09-03T17:08:36+05:30 IST

కావలసిన పదార్థాలు: కైమా - పావుకిలో, గోరుచిక్కుడు (నార తీసి, అంగుళం ముక్కలుగా తరగాలి)

గోరుచిక్కుడు కైమా

కావలసిన పదార్థాలు: కైమా - పావుకిలో, గోరుచిక్కుడు (నార తీసి, అంగుళం ముక్కలుగా తరగాలి) - పావుకిలో, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, ఉల్లిపాయ తరుగు - 1 కప్పు, కారం - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, గరం మసాలా - అర టీ స్పూను, ఎండుకొబ్బరి, గసగసాల పేస్టు - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను, కొత్తిమీర తరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం: కైమాలో పసుపు, అల్లం వెల్లుల్లిపేస్టు, కారం, ఉప్పు కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. గోరుచిక్కుడు తరుగులో తగినంత నీరు పోసి పచ్చివాసన పోయేలా 5 నిమిషాలు మాత్రం ఉడికించి నీరు వార్చేయాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ తరుగు వేగించి ఉడికించిన కైమా, గోరుచిక్కుడు తరుగు వేసి అరకప్పు నీరు చేర్చి ఐదునిమిషాల తర్వాత కొబ్బరి గసగసాల పేస్టు వేయాలి. 2 నిమిషాలు అయ్యాక గరంమసాలా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి దించేయాలి. ఈ కూర పరాటాల్లోకే కాకుండా అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-03T17:08:36+05:30 IST