గసగసాల కూర

ABN , First Publish Date - 2015-09-03T17:06:27+05:30 IST

కావలసిన పదార్థాలు: గసగసాలు - అర కప్పు, ఉల్లిపాయలు - ఒక కప్పు, పచ్చిమిర్చి - రెండు, గరం మసాలా

గసగసాల కూర

కావలసిన పదార్థాలు: గసగసాలు - అర కప్పు, ఉల్లిపాయలు - ఒక కప్పు, పచ్చిమిర్చి - రెండు, గరం మసాలా - అర టీస్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు - ఒక టీస్పూను, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా గసగసాలను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేగాక అందులో గసగసాల ముద్ద వేసి ఐదునిమిషాలపాటు వేపాలి. తర్వాత గరంమసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి నీళ్ళు పోయాలి. కూర ఉడికాక కొత్తిమీర వేసి దించేయాలి. ఈ కూర పరాటాలతో తినడానికి బాగుంటుంది.

Updated Date - 2015-09-03T17:06:27+05:30 IST