పార్శీ రైస్‌

ABN , First Publish Date - 2015-09-01T17:45:21+05:30 IST

కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం - ఒక గ్లాసు, ఉల్లిపాయలు - 50గ్రా.

పార్శీ రైస్‌

కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం - ఒక గ్లాసు, ఉల్లిపాయలు - 50గ్రా. మిరియాలు - ఒక స్పూను,లవంగాలు - ఎనిమిది, పంచదార - చెంచానెయ్యి - 75గ్రా.
దాల్చినచెక్క - నాలుగు ముక్కలునల్ల యాలకులు - ఆరు,ఉప్పు - తగినంత, జీడిపప్పు - ఆరు పలుకులు
తయారీ విధానం :
ముందుగా కుక్కర్లో పంచదార వేసి వేయించాలి. తర్వాత అందులో నెయ్యి వెయ్యాలి. ఇది మరుగుతుండగా లవంగాలు, నల్లయాలకులు, మిరియాలు, దాల్చినచెక్క వేసి వేగాక ఉల్లిపాయ తరగు వేసి బాగా వేయించాలి. ఇందులోనే కడిగిన బాస్మతిబియ్యం వేసి వేయించాలి. బియ్యానికి రెండింతల నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. మూడు విజిల్స్‌ వచ్చిన తర్వాత దించాలి. అంతే పార్శీ రైస్‌ రెడీ.

Updated Date - 2015-09-01T17:45:21+05:30 IST