స్వీట్‌ కార్న్‌ దోశలు

కావలసిన పదార్థాలు: బియ్యప్పిండి - పావు కప్పు, పచ్చిమిర్చి - 1, స్వీట్‌కార్న్‌ - 1 కప్పు, పసుపు - చిటికెడు, బొంబాయి రవ్వ - పావు కప్పు, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో స్వీట్‌కార్న్‌, పసుపు, రవ్వ, బియ్యప్పిండి, ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తగినంత నీటితో దోశల పిండిలా కలుపుకోవాలి. తర్వాత కడాయిలో తాలింపు వేసి పిండిలో కలిపి అరగంట పక్కనుంచాలి. ఇప్పుడు పెనంపై దోశల్లా పోసుకుని రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. వేడివేడిగా కొబ్బరిచట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిండిని పులియబెట్టే పని లేదు కాబట్టి సాయంత్రం ఫలహారంగా కూడా చేసుకోవచ్చు.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులుతాంసిలో ఈదురు గాలులుమటన్‌ షాపుల వద్ద సండే సందడి
Advertisement
Advertisement