కొబ్బరి పప్పు

ABN , First Publish Date - 2015-12-14T14:39:48+05:30 IST

కావలసిన పదార్థాలు: పచ్చికొబ్బరి-కాయలో సగం ముక్క, పెసరపప్పు-రెండు కప్పులు, పచ్చిమిర్చి-మూడు, ఉల్లిపాయలు- చిన్నవి రెండు, నూనె, ఆవాలు, జీలకర్ర-పోపుకు

కొబ్బరి పప్పు

కావలసిన పదార్థాలు: పచ్చికొబ్బరి-కాయలో సగం ముక్క, పెసరపప్పు-రెండు కప్పులు, పచ్చిమిర్చి-మూడు, ఉల్లిపాయలు- చిన్నవి రెండు, నూనె, ఆవాలు, జీలకర్ర-పోపుకు సరిపడా, పసుపు-చిటికెడు, ఉప్పు-రుచికి సరిపడా, మంచినీళ్లు- అర కప్పు.
తయారుచేయు విధానం: ముందుగా పచ్చి కొబ్బరిని తురిమి ఓ గిన్నెలో పెట్టుకోవాలి. తరువాత బాణలిలో కొద్దిగా నూనె పోసి, అందులో ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, కొబ్బరి తురుము, పెసరపప్పు వేసి, మంచినీళ్లు పోసి ఉడికించాలి. ఆఖర్న రుచికి తగినంత ఉప్పు కలుపుకుని దించేయాలి. అంతే - కొబ్బరి పప్పు తయారైనట్లే. వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పప్పు వేసుకుని తింటే ఆదో రుచి.

Updated Date - 2015-12-14T14:39:48+05:30 IST