వెజ్‌ టొమాటో కర్రీ

ABN , First Publish Date - 2017-12-09T22:32:23+05:30 IST

టొమాటోలు-ఆరు, శెనగపిండి- ఒక టేబుల్‌స్పూను, కరివేపాకు-కొన్ని, పెసరపప్పు-250 గ్రాములు, జీలకర్ర-ఒక టీస్పూను...

వెజ్‌ టొమాటో కర్రీ

కావలసినవి
టొమాటోలు-ఆరు, శెనగపిండి- ఒక టేబుల్‌స్పూను, కరివేపాకు-కొన్ని, పెసరపప్పు-250 గ్రాములు, జీలకర్ర-ఒక టీస్పూను, లవంగాలు-మూడు, యాలకులు-2, దాల్చినచెక్క -రెండు (చిన్నవి), పచ్చిమిరపకాయలు-రెండు (సన్నగా తరిగి), వెల్లులి, అల్లం-ఒక టీస్పూను (సన్నగా తరిగి), పచ్చి బటానీలు- ఒక కప్పు, బంగాళాదుంప-ఒకటి, సొరకాయ ముక్కలు, క్యారెట్‌ ముక్కలు- కొన్ని, బెండకాయలు-నాలుగు, గరంమసాలాపొడి, ధనియాలపొడి- రెండు టీస్పూన్లు, ఉప్పు-సరిపడా.
 
తయారీ విధానం
టొమాటోలతో పాటు పెసరపప్పు, పచ్చిమిరపకాయలను ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడకబెట్టాలి.
మూడు విజిల్స్‌ వచ్చే వరకూ స్టవ్‌ మీద ఉంచాలి. చల్లారిన తర్వాత దాన్ని పేస్టులా చేయాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి. తర్వాత అందులో శెనగపిండి వేసి ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపాలి. శెనగపిండి బంగారువర్ణంలోకి వచ్చేదాకా పాన్‌లో వేగించాలి. అందులో బెండ, సొర, క్యారెట్‌, బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. ఆ మిశ్రమంలో సిద్ధంగా ఉంచుకున్న టొమాటో పేస్టుతో పాటు కొద్దిగా నీళ్లు కూడా పోసి ఉడకనివ్వాలి. ధనియాలు, గరంమసాలా పొడితో పాటు పసుపు, తగినంత ఉప్పు అందులో వేసి కలపాలి. దీన్ని కొంచెంసేపు సన్ననిమంటపై ఉడకనివ్వాలి.
కూర చిక్కబడ్డ తర్వాత కిందకి దించి వేడి వేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2017-12-09T22:32:23+05:30 IST