జొన్న కిచిడీ!

ABN , First Publish Date - 2017-11-28T21:35:13+05:30 IST

జొన్న, మొక్కజొన్న గింజలు, కీరదోస, కొత్తిమీర, మిరపకాయలు,..

జొన్న కిచిడీ!

కావలసిన వస్తువులు
 
జొన్న, మొక్కజొన్న గింజలు, కీరదోస, కొత్తిమీర, మిరపకాయలు
 
తయారీ విధానం
తగుమాత్రపు నీటిలో జొన్నలను రాత్రంతా నానబెట్టాలి.
ఉదయాన్నే అదే నీటిలో పావుగంట పాటు ఉడికించాలి.
కడాయిలో కొంచెం నూనె వేసి, వేడి చేయాలి.
జొన్న, మొక్కజొన్న గింజలను కడాయిలో వేసుకోవాలి.
నిమిషం తరువాత కీరదోస ముక్కలను కలుపుకోవాలి.
ఎండు మిరపకాయలు వేసుకోవాలి.
తగుమాత్రంగా ఉప్పు, కారం, వేసుకోవాలి.
ఆఖరులో కొత్తిమీర కలుపుకంటే జొన్న కిచిడీ తయారయినట్టే!

Updated Date - 2017-11-28T21:35:13+05:30 IST