కంది దోశ

ABN , First Publish Date - 2017-02-04T21:29:58+05:30 IST

కావలసిన పదార్థాలు: దొడ్డు బియ్యం- మూడు కప్పులు, కందిపప్పు- ఒకటిన్నర

కంది దోశ

కావలసిన పదార్థాలు:

దొడ్డు బియ్యం- మూడు కప్పులు, కందిపప్పు- ఒకటిన్నర కప్పులు, మినప్పప్పు- అర కప్పు, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- మూడు, మెంతులు- చిటికెడు, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
బియ్యం, మినప్పప్పు, మెంతులను కలిపి, కందిపప్పును విడిగా ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ముందుగా కందిపప్పును కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ రుబ్బాలి. తర్వాత బియ్యం, మినప్పప్పు, మెంతులను కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పిండిలో ఉప్పు వేసి రెండు గంటలసేపు నానబెట్టాలి. తర్వాత పెనం మీద నూనె రాసి దోశలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పైన జల్లుకోవాలి.

Updated Date - 2017-02-04T21:29:58+05:30 IST