రాజ్మా వెజ్‌ లాలిపాప్‌

ABN , First Publish Date - 2017-01-21T17:58:37+05:30 IST

కావాల్సిన పదార్థాలు రాజ్మా, అలసందలు - ఒక్కోటి అర కప్పు చొప్పున, పసుపు, గరం మసాలా - ఒక్కోటి అర టీ స్పూన్‌ చొప్పున, కారం - ఒక టీ స్పూన్‌, చాట్‌ మసాలా

రాజ్మా వెజ్‌ లాలిపాప్‌

కావాల్సిన పదార్థాలు
రాజ్మా, అలసందలు - ఒక్కోటి అర కప్పు చొప్పున, పసుపు, గరం మసాలా - ఒక్కోటి అర టీ స్పూన్‌ చొప్పున, కారం - ఒక టీ స్పూన్‌, చాట్‌ మసాలా - అర టీ స్పూన్‌, ఉప్పు - తగినంత, బంగాళదుంపలు - అరకప్పు (ఉడికించి), ఉల్లికాడలు - అరకప్పు (తరిగి), మిరియాలు - అర టీ స్పూన్‌, కార్న్‌ఫ్లేక్స్‌ - అరకప్పు, మైదా - రెండు టీ స్పూన్‌లు, నూనె - సరిపడా, స్టిక్స్‌ - కావాల్సినన్ని.
 
తయారీ విధానం
రాజ్మా, అలసందలను రాత్రంతా నానబెట్టాలి. వీటిని మెత్తటి ముద్దగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఇందులో పసుపు, గరంమసాలా, కారం, చాట్‌ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.ఆ తరువాత ఉడికించిన బంగాళదుంపలు, ఉల్లికాడల తరుగు, మిరియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. రాజ్మా మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు చేయాలి. బంగాళదుంపల మిశ్రమంలోకి రాజ్మా ముద్దల్ని పెట్టి మూసేసి టిక్కీలా చేయాలి. కార్న్‌ఫ్లేక్‌, మైదా, ఉప్పు మిశ్రమంలో ఈ టీక్కిలను దొర్లించాలి. ఈ టిక్కీలను మరిగే నూనెలో వేసి బాగా వేగించాలి. ముదురురంగులోకి వచ్చాక వాటిని బయటకు తీససి.. స్టిక్స్‌ను గుచ్చితే రాజ్మా వెజ్‌ లాలిపాప్‌ రెడీ. 

Updated Date - 2017-01-21T17:58:37+05:30 IST