కంది వడ

ABN , First Publish Date - 2017-02-04T21:28:43+05:30 IST

కావలసిన పదార్థాలు కందిపప్పు- ఒక కప్పు, శనగపప్పు- ఒక కప్పు, మినప్పప్పు- ఒక కప్పు, బియ్యం- ఒ

కంది వడ

కావలసిన పదార్థాలు
కందిపప్పు- ఒక కప్పు, శనగపప్పు- ఒక కప్పు, మినప్పప్పు- ఒక కప్పు, బియ్యం- ఒ
క టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి- ఆరు, అల్లం- రెండు అంగుళాల ముక్క, తరిగిన కరివేపాకు- కొద్దిగా, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
కందిపప్పు, శనగపప్పు, బియ్యం, మినప్పప్పులను గంటసేపు నానబెట్టాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వేసి వడల పిండిలా రుబ్చుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఉప్పు వేసి కలుపుకుని నూనెలో రెండు వైపులా దోరగా వేగించుకోవాలి.

Updated Date - 2017-02-04T21:28:43+05:30 IST