ఆమ్లా, బీట్‌రూట్‌ టిక్కీ

ABN , First Publish Date - 2017-11-04T13:39:17+05:30 IST

ఉసిరికాయలు-ఆరు (తురిమినవి), ఉడకబెట్టి మెత్తగా చేసిన బీట్‌రూట్‌ముద్ద-ఒక కప్పు, ఉడకబెట్టి మెత్తగా ముద్దలా..

ఆమ్లా, బీట్‌రూట్‌ టిక్కీ

కావలసినవి
ఉసిరికాయలు-ఆరు (తురిమినవి), ఉడకబెట్టి మెత్తగా చేసిన బీట్‌రూట్‌ముద్ద-ఒక కప్పు, ఉడకబెట్టి మెత్తగా ముద్దలా చేసిన మూడు బంగాళాదుంపలు (పొట్టు తీసేసి), నూనె- ఒక టేబుల్‌స్పూను, ఉల్లిపాయ-ఒకటి (సన్నగా తరిగి), ఉప్పు-తగినంత, కారం, గరంమసాలా- ఒక్కొక్కటీపావు టేబుల్‌స్పూను, నిమ్మరసం- ఒక టేబుల్‌స్పూను.
 
తయారీ
పెద్ద బాండిలో నూనె వేసి బాగా వేడిచేయాలి. అందులో సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయముక్కల్ని వేసి బ్రౌన్‌ రంగులోకి వచ్చేవరకూ నూనెలో కలుపుతుండాలి. తర్వాత అందులో బీట్‌రూట్‌ ముద్ద, ఉప్పు వేసి బాగా కలపాలి. నీరు ఇంకేవరకూ ఆ మిశ్రమాన్ని స్టవ్‌ మీద ఉంచాలి. పొడిగా తయారైన ఆ మిశ్రమంలో కారం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అందులోనే ఆమ్లా, ఉడికిన బంగాళాదుంప ముద్ద వేసి గరిటెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో అరగంటపాటు ఉంచాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి వడల్లా వత్తాలి. ప్యాన్‌ వేడిచేసి అందులో కొద్దిగా నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఒక్కొక్క టిక్కి ఆ నూనెలో క్రిస్పీగా అయ్యేదాకా రెండు వైపులా బాగా వేగించాలి. ఇలాగే అన్ని టిక్కీలను కరకరలాడేట్టు చేసి వేడిగా తింటే చాలా బాగుంటాయి.

Updated Date - 2017-11-04T13:39:17+05:30 IST