వెజ్‌ కట్‌లెట్స్‌

ABN , First Publish Date - 2018-07-15T17:50:59+05:30 IST

బంగాళదుంపలు - 3, బీట్‌రూట్‌ - 1, అరటికాయ - 1, ఉడికించిన పచ్చిబఠాణి, మొక్కజొన్న గింజలు..

వెజ్‌ కట్‌లెట్స్‌

కావలసిన పదార్థాలు
 
బంగాళదుంపలు - 3, బీట్‌రూట్‌ - 1, అరటికాయ - 1, ఉడికించిన పచ్చిబఠాణి, మొక్కజొన్న గింజలు - అరకప్పు చొప్పున, వేగించిన పల్లీ బద్దలు - పావు కప్పు, కొబ్బరి తురుము, కొత్తిమీర - అరకప్పు చొప్పున, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, గరం మసాల, ఆమ్‌ చూర్‌ - ఒక టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి సరిపడా, మైదా - అరకప్పు, బ్రెడ్‌ పొడి - ఒక కప్పు, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం
 
బంగాళదుంపలు, బీట్‌రూట్‌, అరటికాయ తొక్కలు తీసి చిన్న ముక్కలుగా తరిగి ఆవిరిపై ఉడికించాలి. ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో ఉడికించిన కూరగాయల ముక్కలతో పాటు పచ్చిబఠాణి, మొక్కజొన్న గింజలు, పల్లీలు, కొబ్బరి తురుము, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల, ఆమ్‌చూర్‌, ఉప్పు కలిపి ముద్దలా తయారుచేసి (ముద్ద గట్టిగా లేకపోతే, కొంత బ్రెడ్‌ పౌడర్‌ కలిపి) ఫ్రిజ్‌లో 30 నిమిషాలు ఉంచాలి. తర్వాత దళసరి చపాతీలా చేసి కుకీస్‌ కట్టర్‌తో కట్‌లెట్స్‌ చేసుకుని చుట్టూ నూనె రాసి మళ్లీ ఫ్రిజ్‌లో 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత నీటిలో కరిగించిన మైదాజారులో ముంచి, బ్రెడ్‌ పౌడర్‌ అద్ది నూనెలో దోరగా వేగించాలి. ఈ కట్‌లెట్స్‌ టమోటా కెచప్‌తో రుచిగా ఉంటాయి.

Updated Date - 2018-07-15T17:50:59+05:30 IST