నువ్వుల పొడితో బచ్చలి కూర

ABN , First Publish Date - 2017-10-21T22:16:13+05:30 IST

బచ్చలి తరుగు - 2 కప్పులు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఎండుమిర్చి...

నువ్వుల పొడితో బచ్చలి కూర

కావలసిన పదార్థాలు
బచ్చలి తరుగు - 2 కప్పులు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఎండుమిర్చి - 4, పచ్చిమిర్చి - 4, వెల్లుల్లి తరుగు - ఒక టేబుల్‌ స్పూను, (వేగించిన) నువ్వుల పొడి - 2 టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు - 4 రెబ్బలు, పోపు దినుసులు - సరిపడా, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
కడాయిలో నూనె వేడిక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేగించాలి. తర్వాత వెల్లుల్లి తరుగు, చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయాలి. నిమిషం తర్వాత బచ్చలి తరుగుతో పాటు పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి చిన్న మంటపై మగ్గించాలి. ఆకు దగ్గరయ్యాక నువ్వుల పొడి చల్లి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. ఈ కూర అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2017-10-21T22:16:13+05:30 IST