ముర్గి పెషావరి

ABN , First Publish Date - 2015-08-31T22:03:17+05:30 IST

కావలసిన వస్తువులు: బోన్‌లెస్‌ చికెన్‌ - 1 కేజి, ఉల్లిపాయలు - అరకేజి, కాప్సికం - అరకేజి, టమేటోలు

ముర్గి పెషావరి

కావలసిన వస్తువులు: బోన్‌లెస్‌ చికెన్‌ - 1 కేజి, ఉల్లిపాయలు - అరకేజి, కాప్సికం - అరకేజి, టమేటోలు - అరకేజి, అల్లం వెల్లుల్లి పేస్టు - వంద గ్రాములు, జీడిపప్పు- 175 గ్రాములు, కారం, ఉప్పు, పసుపు సరిపడా, క్రీము - వందగ్రాములు, నూనె - 60 గ్రాములు.
తయారుచేసే విధానం: ఉల్లిపాయలు, క్యాప్సికంలను సన్నగా తరు క్కొని, జీడిపప్పుని పేస్టులా చేసుకుని టమేటోలను గుజ్జుగా గ్రైండు చేసుకుని పక్కనుంచుకోవాలి. పాత్రలో నూనె వేడెక్కిన తరువాత ఉల్లిపాయల్ని వేసి అవి బ్రౌన్‌ కలర్‌ వచ్చేక, క్యాప్సికం ముక్కల్ని కూడా వేసి మెత్తబడేదాకా వేగించాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కల్ని వేసి ఐదు నిమిషాలు వేగించి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమేటో గుజ్జు, ఉప్పు వేసి అరగంట సేపు ఉడికించాలి. తర్వాత జీడిపప్పు పేస్టు వేసి మరో ఇరవై నిమిషాలు ఉంచి దించేముందు క్రీము వేయండి.

Updated Date - 2015-08-31T22:03:17+05:30 IST