మెంతి మష్రూమ్స్‌

ABN , First Publish Date - 2015-08-31T21:53:31+05:30 IST

కావలసినవి: తాజా మెంతి ఆకు 300 గ్రాములు, బటన్‌ మష్రూమ్‌ 200 గ్రాములు, నూనె నాలుగు టేబుల్‌ స్పూన్‌లు

మెంతి మష్రూమ్స్‌

కావలసినవి: తాజా మెంతి ఆకు 300 గ్రాములు, బటన్‌ మష్రూమ్‌ 200 గ్రాములు, నూనె నాలుగు టేబుల్‌ స్పూన్‌లు, టొమాటొలు మూడు (తరిగినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర పొడి ఒక టేబుల్‌ స్పూన్‌, పసుపు ఒక టీ స్పూన్‌, పచ్చి మిరపకాయలు రెండు (తరిగినవి)
ఎలా చేయాలి: మష్రూమ్‌లను కోసి ఒక పక్కన పెట్టుకోవాలి. మెంతి ఆకులను గిల్లి కడిగాక సన్నగా తరిగి పెట్టుకోవాలి. సగం నూనె తీసుకుని అందులో మెంతి ఆకులను వేసి రెండు నిముషాల పాటు వేగించాలి. తరువాత మూడు లేదా నాలుగు టేబుల్‌ స్పూన్‌ల నీళ్లు పోసి మూతపెట్టి సన్న సెగపై ఐదు లేదా ఆరు నిముషాలు ఉంచాలి. తరిగిన టొమాటొలు వేసి రెండు నిముషాల తర్వాత మిగిలిన పదార్థాలన్నింటిని వేసి మూతపెట్టాలి. సన్నని సెగపై ఉంచే అప్పుడప్పుడు కలియబెడుతూ ఉండాలి. ఇలా ఐదారు నిముషాలు ఉంచిన తరువాత దించి వేడి వేడిగా పరోటాలతో తింటే బాగుంటుంది.

Updated Date - 2015-08-31T21:53:31+05:30 IST