సజ్జ రోటీ

ABN , First Publish Date - 2017-09-09T16:45:26+05:30 IST

కావలసిన పదార్థాలు: సజ్జ పిండి- 2 కప్పులు, మరిగిన నీళ్లు-1.5 కప్పు, నూనె లేదా నెయ్యి-తగినంత, ఉప్పు-సరిపడ.

సజ్జ రోటీ

కావలసిన పదార్థాలు: సజ్జ పిండి- 2 కప్పులు, మరిగిన నీళ్లు-1.5 కప్పు, నూనె లేదా నెయ్యి-తగినంత, ఉప్పు-సరిపడ.
 
తయారీ: ఒకటిన్నర కప్పు నీళ్లలో ఉప్పు వేసి బాగా మరిగించాలి. రెండు కప్పుల సజ్జ పిండి తీసుకుని మరిగిన నీళ్లను ఆ పిండిలో కొద్దికొద్దిగా పోస్తూ పిండిని ముద్దలా చేయాలి. మెత్తటి సజ్జ పిండితో రొట్టెలను చేతులతో చేయడం కష్టం. అందుకే పిండిముద్దను చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్‌ కాగితం తీసుకుని దానిమీద కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి తయారుచేసి పెట్టుకున్న సజ్జ పిండి ఉండల్ని ఒక్కొక్కదాన్ని నూనె లేదా నెయ్యి రాసిన ప్లాస్టిక్‌ కాగితం మీద పెట్టాలి. ఇలా నూనె లేదా నెయ్యి రాయడం వల్ల సజ్జ పిండి ప్లాస్టిక్‌ కాగితానికి అతుక్కుపోదు. ఒక ప్లాస్టిక్‌ కాగితం మీద సజ్జ పిండి ముద్ద పెట్టి దానిపై నూనె రాసిన మరో ప్లాస్టిక్‌ కాగితాన్ని పెట్టాలి. ఆ తర్వాత ఒక స్టీలు ప్లేటు తీసుకుని వాటి అంచులను పట్టుకుని ప్లేటును ప్లాస్టిక్‌ కాగితం మధ్యలో ఉంచిన సజ్జ పిండి ముద్దపై ఒత్తాలి. ఇలా చేయడం వల్ల పిండి రోటీలా పెద్దదిగా ప్లాస్టిక్‌ కాగింతంపై పరచుకుంటుంది.
 
తర్వాత పైనున్న ప్లాస్టిక్‌ కాగితాన్ని తీసేసి వేడిగా ఉన్న తావా మీదకు రొట్టెను మార్చాలి. ఈ క్రమంలో ప్లాస్టిక్‌ కాగితం తావాకు అంటుకోకుండా జాగ్రత్తపడాలి. తావాపై రోటీ రంగు మారిన వెంటనే రొట్టెను రెండవ వైపుకు తిప్పి కాల్చాలి. రొట్టె మీద బ్రౌన్‌ మచ్చలు కనపడిన వెంటనే తావా మీద నుంచి దాన్ని తీసేయాలి. పైన చెప్పిన విధంగానే మిగతా రొట్టెలు కూడా తయారుచేసి తావా మీద కాల్చాలి. వేడి వేడి సజ్జ రోటీలను ఏ కూరతో తిన్నా రుచిగా ఉంటాయి. చెన్నామసాలా, వేరుశెనగ చె ట్నీపొడితో సజ్జ రొట్టె తింటే రుచి సూపర్‌గా ఉంటుంది. (సూచన:ప్లాస్టిక్‌ కాగితం బదులు బట్టర్‌ కాగితాన్ని కూడా సజ్జ రొట్టెలను చేసేందుకు వాడొచ్చు.)

Updated Date - 2017-09-09T16:45:26+05:30 IST