బీట్‌ రూట్‌ జెల్లీ

ABN , First Publish Date - 2015-08-29T23:34:55+05:30 IST

కావలసిన పదార్థాలు: మీడియం సైజు బీట్‌రూట్స్‌ - 2, పంచదార - పావు కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను

బీట్‌ రూట్‌ జెల్లీ

కావలసిన పదార్థాలు: మీడియం సైజు బీట్‌రూట్స్‌ - 2, పంచదార - పావు కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నీరు - తగినంత.
తయారుచేసే విధానం: బీట్‌రూట్‌లను ఉడికించి, తొక్కతీసి ముక్కలుగా చేసుకుని మిక్సీలో పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టులో పంచదార కలిపి సన్నటి మంటపై దాదాపు 40 నిమిషాలు అడుగంటకుండా తిప్పుతూ ఉడికించాలి. మరీ ముద్దలా అనిపిస్తే రెండు టేబుల్‌ స్పూన్ల నీరు పోసుకోవచ్చు. తీగ పాకం రాగానే మంట తీసి, యాలకుల పొడి చల్లాలి. పిల్లలు ఇష్టంగా తినే ఈ జెల్లీ ఫ్రిజ్‌లో వారం రోజులు నిలువ ఉంటుంది.

Updated Date - 2015-08-29T23:34:55+05:30 IST