బొబ్బర్ల కూటు

ABN , First Publish Date - 2015-08-29T23:36:54+05:30 IST

కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, చింతపండు గుజ్జు - అరకప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు

బొబ్బర్ల కూటు

కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, చింతపండు గుజ్జు - అరకప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత. పేస్టు కోసం: ఉల్లిపాయ - 1, ఎండు మిర్చి - 3, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు. పొడికోసం: (వేగించిన) మెంతులు - 1 టీ స్పూను, గసగసాలు, మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు - 1 టేబుల్‌ స్పూను చొప్పున, పల్లీలు - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: 3 కప్పుల నీటిలో బొబ్బర్లని ఉడికించి నీరు వడకట్టి పక్కనుంచాలి. అరకప్పు నీటిలో పొడి, చింతపండు గుజ్జు కలపాలి. నూనెలో ఆవాలు వేగాక, అల్లం వెల్లుల్లి, ఉల్లిపేస్టు పచ్చివాసన పోయేదాక వేగించి, చింతపండు మిశ్రమం కలిపి, కొద్ది నీరు పోసి మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. తగినంత ఉప్పు, పసుపు కలపాలి. చివర్లో ఉడికించిన బొబ్బర్లు వేసి 6 నిమిషాల తర్వాత దించేముందు అర టీ స్పూను నెయ్యి కలపాలి. వేడి వేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-29T23:36:54+05:30 IST