కొబ్బరితో ముంజల కూర

ABN , First Publish Date - 2018-06-02T17:29:16+05:30 IST

ముంజలు-ఒక కప్పు, పచ్చికొబ్బరిపేస్టు- అర కప్పు, నువ్వులపొడి- ఒక టేబుల్‌స్పూను, నూనె-రెండు టేబుల్‌స్పూన్లు

కొబ్బరితో ముంజల కూర

కావలసినవి
 
ముంజలు-ఒక కప్పు, పచ్చికొబ్బరిపేస్టు- అర కప్పు, నువ్వులపొడి- ఒక టేబుల్‌స్పూను, నూనె-రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చిపేస్టు-రెండు టీస్పూన్లు, ఉప్పు-తగినంత, ఉల్లిపాయ-ఒకటి (సన్నగా తరిగి), కసూరిమేథి- అరటీస్పూను, అల్లంవెల్లుల్లిపేస్టు-ఒక టీస్పూను, గరంమసాలా-ఒక టీస్పూను, పసుపు-చిటికెడు, కొత్తిమీర-కొద్దిగా, టొమాటో ముక్కలు-అరకప్పు, చింతపండు గుజ్జు-తగినంత.
 
తయారీవిధానం
 
కడాయిలో నూనె వేసి వేడిచేయాలి. అందులో ఉల్లిపాయముక్కలు వేసి బ్రౌన్‌ రంగులోకి వచ్చేవరకూ వేగించాలి. పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్టు అందులో వేసి వేగించాలి. తర్వాత గరంమసాలా, కసూరిమేథీ, పచ్చిమిర్చి పేస్టు, టొమాటో ముక్కలు కూడా అందులో వేసి వేగించాలి. ఈ మిశ్రమంలో పచ్చికొబ్బరిపేస్టు, నువ్వులపొడితో పాటు కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత పొట్టు తీసిన ముంజల ముక్కలను మిశ్రమంలో వేసి కలపాలి. అందులో చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. ముంజలు మెత్తబడ్డ తర్వాత దానిపై కొత్తిమీర చల్లాలి. తాటిముంజల కొబ్బరికూర రెడీ.

Updated Date - 2018-06-02T17:29:16+05:30 IST