మామిడిపండు మజ్జిగ పులుసు

ABN , First Publish Date - 2018-05-05T22:22:33+05:30 IST

మామిడిపండు- ఒకటి (పెద్ద ముక్కలుగా కోసి), తాజా కొబ్బరి- పావు కప్పు, జీలకర్ర- ఒక టీస్పూను..

మామిడిపండు మజ్జిగ పులుసు

కావలసినవి
 
మామిడిపండు- ఒకటి (పెద్ద ముక్కలుగా కోసి), తాజా కొబ్బరి- పావు కప్పు, జీలకర్ర- ఒక టీస్పూను, పచ్చిమిరపకాయ- ఒకటి (సన్నగా తరిగి), అల్లం- చిన్న ముక్క (నచ్చితే), పెరుగు- ఒక కప్పు. తాలింపు కోసం: ఆవాలు- ఒక టీస్పూను, మెంతులు- అర టీస్పూను, కరివేపాకు- తగినంత, వంటనూనె- ఒక టీస్పూను, ఉప్పు- రుచికి సరిపడా.
 
తయారీవిధానం
 
కడాయి నీళ్లు పోసి వేడిచేయాలి. అందులో మామిడిపండు ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మూడు నిమిషాలు ఉడికించాలి. పచ్చికొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం మిక్సీలో వేసి, కొన్ని గోరువెచ్చని నీళ్లు పోసి, పేస్టులా చేయాలి. ఈ పేస్టును పెరుగులో వేసి కలపాలి. ఉడికిన మామిడిపండు ముక్కలను అందులో వేసి కాసేపు ఉడికించాలి.
మసాలా, ఉప్పు సరిపోయాయో లేదో చెక్‌ చేసుకోవాలి. చిన్న పాన్‌లో కొద్దిగా నూనె పోసి, వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, మెంతులు వేయాలి. అవి వేగాక దాన్ని మామిడిపండు మజ్జిగ పులుసులో వేయాలి. ఈ మామిడిపండు మజ్జిగ పులుసును వేడి అన్నంతో తింటే బాగుంటుంది.

Updated Date - 2018-05-05T22:22:33+05:30 IST