పెసలతో కూర

ABN , First Publish Date - 2018-03-03T23:53:20+05:30 IST

పెసలు- ఒక కప్పు, ఉల్లిపాయలు, టొమాటోలు - ఒక్కోటి రెండు చొప్పున, కారం- ఒక టీస్పూను, జీలకర్ర...

పెసలతో కూర

కావలసినవి
 
పెసలు- ఒక కప్పు, ఉల్లిపాయలు, టొమాటోలు - ఒక్కోటి రెండు చొప్పున, కారం- ఒక టీస్పూను, జీలకర్ర, ధనియాలపొడి- ఒక్కొక్కటీ అర స్పూను చొప్పున, గరంమసాలా- పావు టీస్పూను, నూనె- మూడు టీస్పూన్లు, కసూరి మెంతి- కొద్దిగా, జీలకర్ర- పావు టీస్పూను, ఉప్పు- తగినంత.
 
తయారీవిధానం
 
పెసల్ని బాగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. ఉల్లిపాయలు, టొమాటోలను ఒకే పరిమాణంలో ఉండేలా పొడుగ్గా, సన్నగా తరగాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో నూనె వేసి, అది వేడెక్కాక జీలకర్ర వేయాలి. అది వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం వేగించాలి. తర్వాత అందులో టొమాటో ముక్కల్ని కూడా వేసి మరి కాసేపు వేగించాలి.
ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, కారం ఒకదాని తర్వాత ఒకటి వేసి టొమాటో, ఉల్లిపాయముక్కల్లో అవి బాగా కలిసేట్టు గరిటెతో కలపాలి. తర్వాత ఇందులో నానబెట్టిన పెసలను వేసి రెండున్నర కప్పుల నీళ్లు పోసి తగినంత ఉప్పు వేయాలి.
ఆ తర్వాత ప్రెషర్‌ కుక్కర్‌ మీద మూత పెట్టి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకూ ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. తరువాత కసూరి మెంతి వేసి కలపాలి.
రెడీ అయిన కూరని వేరే పాత్రలోకి మార్చాక పైన కొత్తిమీర తరుగు చల్లాలి. రొట్టెలతో దీన్ని వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికీ ఎంతో మంచిది.

Updated Date - 2018-03-03T23:53:20+05:30 IST