మామిడల్లం పచ్చడి

ABN , First Publish Date - 2015-09-01T22:51:30+05:30 IST

కావలసిన పదార్థాలు: మామిడల్లం - పావు కిలో, చింతపండు - 200 గ్రా., బెల్లం తరుగు - 200 గ్రా

మామిడల్లం పచ్చడి

కావలసిన పదార్థాలు: మామిడల్లం - పావు కిలో, చింతపండు - 200 గ్రా., బెల్లం తరుగు - 200 గ్రా., కారంపొడి - 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - అరకప్పు + 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - 1 టీ స్పూను, ఇంగువ - చిటికెడు.
తయారుచేసే విధానం: గోరువెచ్చని నీటిలో చింతపండు నానబెట్టాలి. తొక్కతీసి, శుభ్రం చేసిన మామిడల్లం ఆరబెట్టి ముక్కలుగా తరగాలి. మిక్సీలో మామిడల్లం ముక్కలు, చింతపండు, బెల్లం తరుగు, కారం, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో మెంతులు, ఇంగువ తాలింపు పెట్టి రుబ్బిన పేస్టు కలిపి చిన్న మంటపై (తడి ఆవిరై నూనె పైకి తేలేవరకు) సుమారు 20 నిమిషాలు ఉంచాలి. చల్లారిన తర్వాత జాడీలో భద్రపరచాలి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, బోండా, పుణుగు, పెసరట్టు, గుంతపొంగనాలు, ఉప్మా లాంటి ఫలహారాల్లోకి బాగుంటుంది.

Updated Date - 2015-09-01T22:51:30+05:30 IST