ఆమ్లారైస్

ABN , First Publish Date - 2018-11-10T18:18:03+05:30 IST

ఉడికించిన అన్నం, ఇంగువ, పసుపు, నెయ్యి, ఉప్పు, నూనె, నువ్వుల పొడి, తురిమిన ఉసిరికాయ...

ఆమ్లారైస్

కావలసినవి
 
ఉడికించిన అన్నం, ఇంగువ, పసుపు, నెయ్యి, ఉప్పు, నూనె, నువ్వుల పొడి, తురిమిన ఉసిరికాయ, కరివేపాకు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కొత్తిమీర.
 
తయారీవిధానం
పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక చిటికెడు ఇంగువతో పాటు పోపు దినుసులు వేయాలి. ఈ పోపు దినుసుల్లో ఎండుమిర్చి కూడా వేయాలి. పోపు సరిగ్గా వేగిన తర్వాత అందులో కరివేపాకు వేయాలి. రెడీగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా అందులో వేసి అవి వేగిన తర్వాత చిటికెడు పసుపు వేయాలి. ముందుగా నువ్వులను వేగించి మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిని పోపులో కలపాలి. అందులోనే ఉసిరి తరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసి కలపాలి.
కొత్తిమీరను ఈ ఆమ్లా రైస్‌పై చల్లాలి. జీడిపప్పును వేగించి వాటిని ఆమ్లా రైస్‌పై గార్నిష్‌ చేయాలి.

Updated Date - 2018-11-10T18:18:03+05:30 IST