ఆలూ బర్గర్‌

ABN , First Publish Date - 2015-08-26T21:24:02+05:30 IST

కావలసిన పదార్థాలు: ఆలూ - వందగ్రాములు, పచ్చిబఠాణి - 60 గ్రా., ఆవాలు - 15 గ్రా., కరివేపాకు - 4 రెబ్బలు

ఆలూ బర్గర్‌

కావలసిన పదార్థాలు: ఆలూ - వందగ్రాములు, పచ్చిబఠాణి - 60 గ్రా., ఆవాలు - 15 గ్రా., కరివేపాకు - 4 రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు - 20 , పసుపు - 5 గ్రా., కొత్తిమీర - 1 కట్ట, ఉప్పు- రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా, టమోటాలు - 2, ఉల్లిపాయ -1, గోధుమ బర్గర్‌ బన్స్‌ (బేకరీల్లో అమ్ముతారు) - 2.
తయారుచేసే విధానం: టమోటాలను, ఉల్లిపాయను గుండ్రంగా స్లైసుల్లా తరిగి పక్కనుంచుకోవాలి. ఆలూని ఉడికించి మెదిపి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు చిటపటమన్నాక కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి వేగాక, పసుపు, పచ్చిబఠాణీ, ఆలూ వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల్లో దించేసి ఈ ముద్దను రెండు సమభాగాలు చేసి గుండ్రని ఆకారంలో ఒత్తి నాన్‌స్టిక్‌ పాన్‌లో రెండు వైపులా దోరగా వేగించాలి. వీటిని రెండు బన్‌ల మధ్య టమోటా, ఉల్లిపాయ చక్రాల్తో పెట్టి తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-26T21:24:02+05:30 IST