వంకాయ కూటు

ABN , First Publish Date - 2015-09-01T22:03:55+05:30 IST

కావలసిన పదార్థాలు: వంకాయలు - 4, ఉల్లిపాయ తరుగు - 1 కప్పు, పెసరపప్పు - ముప్పావు కప్పు

వంకాయ కూటు

కావలసిన పదార్థాలు: వంకాయలు - 4, ఉల్లిపాయ తరుగు - 1 కప్పు, పెసరపప్పు - ముప్పావు కప్పు, శనగపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, సాంబారు పొడి - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - 3, కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర - అర టీ స్పూను, నూనె - 1టేబుల్‌ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - చిటికెడు, ఆవాలు - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: పప్పులు మెత్తగా ఉడికించి మెదిపి పెట్టుకోవాలి. జీరా, పచ్చిమిర్చి, కొబ్బరి కలిపి పేస్టు చేయాలి. కడాయిలో ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పసుపు, ఉల్లి తరుగు, వంకాయముక్కలు వరసగా వేగించి, సాంబారు పొడి, ఉప్పు కలిపి అరకప్పు నీరు పోయాలి. ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరి మిశ్రమం, ఉడికించిన పప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఈ కూటు అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-01T22:03:55+05:30 IST