ఉసిరి జామ్‌

ABN , First Publish Date - 2015-09-01T22:02:59+05:30 IST

కావలసిన పదార్థాలు: (కొండ) ఉసిరి తురుము - 1 కప్పు, నీరు - పావు కప్పు, పంచదార - ఒకటిన్నర కప్పు

ఉసిరి జామ్‌

కావలసిన పదార్థాలు: (కొండ) ఉసిరి తురుము - 1 కప్పు, నీరు - పావు కప్పు, పంచదార - ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, దాల్చినచెక్క - అంగుళం ముక్క.
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న పాత్రలో ఉసిరి తురుము, పంచదార, నీరు వేసి పంచదార కరిగేవరకు ఉడికించాలి. లేత తీగ పాకం వచ్చేముందు మంట తగ్గించి యాలకుల పొడి, దాల్చినచెక్క వేసి మరో 3 నిమిషాలు ఉంచాలి. తర్వాత దించేసి చల్లారిన తర్వాత దాల్చిన చెక్క తీసేసి, గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లోపెట్టాలి. బ్రెడ్‌పైనే కాకుండా, పరగడుపున అర టీ స్పూను చొప్పున లేహ్యంగా తిన్నా ఆరోగ్యరీత్యా మంచిది.

Updated Date - 2015-09-01T22:02:59+05:30 IST