మష్రూమ్‌ రైస్‌

ABN , First Publish Date - 2015-08-29T23:08:39+05:30 IST

కావలసిన పదార్థాలు: అన్నం - రెండు కప్పులు, మష్రూమ్‌ - నాలుగు, పచ్చి బఠాణీ - 50గ్రా, నెయ్యి - 20గ్రా

మష్రూమ్‌ రైస్‌

కావలసిన పదార్థాలు: అన్నం - రెండు కప్పులు, మష్రూమ్‌ - నాలుగు, పచ్చి బఠాణీ - 50గ్రా, నెయ్యి - 20గ్రా, కరివేపాకు - రెండు రెబ్బలు, మిరియాల పొడి - అర టీస్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, సోయాసాస్‌ - అర టీస్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: నెయ్యిలో మష్రూమ్‌ ముక్కలు, ఉడి కించిన బఠాణీలు, అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు దోరగా వేగించి సోయాసాస్‌, మిరియాలపొడి, ఉప్పు కలపాలి. తరవాత అన్నంలో కలిపి కొద్దిసేపు వేయించి వేడిగా ఉన్నప్పుడే చిల్లీసాస్‌తో తినాలి.

Updated Date - 2015-08-29T23:08:39+05:30 IST