ఉల్లిపాయ సలాడ్‌

ABN , First Publish Date - 2015-08-31T20:30:39+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు - 2, నిమ్మకాయలు - 3, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు

ఉల్లిపాయ సలాడ్‌

కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు - 2, నిమ్మకాయలు - 3, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఉల్లిపాయల్ని సన్నగా, పొడుగ్గా తరిగి ఒక పాత్రలో వేసి చిటికెడు ఉప్పు, స్పూను నిమ్మరసం చల్లి పది నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత గోరువెచ్చని నీటిని ఉల్లితరుగు మునిగే వరకు పోసి మరో పది నిమిషాలు ఉంచి నీరంతా ఒంపేయాలి. మళ్లీ ఉప్పు, నూనె, నిమ్మరసం కలిపి మూతపెట్టి ఒక రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయానికి ఉల్లి తరుగంతా పింక్‌ రంగులోకి మారిపోయి చూడడానికి చాలా అందంగా కన్పిస్తుంది. ఉప్పు, నిమ్మరసంలో ఊరడం వల్ల ఉల్లి సరికొత్త రుచితో నోరూరించేలా ఉంటుంది.

Updated Date - 2015-08-31T20:30:39+05:30 IST