ఎగ్ పిజ్జా (టర్కీ)
v id="pastingspan1">
కావలసిన పదార్థాలుపిజ్జా బేస్ - 2, ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, కారం పొడి - ఒక టీ స్పూను, పాలకూర - 200 గ్రా., క్రీమ్ - 40 గ్రా., పనీర్ తురుము - 60 గ్రా., పుదీనా తరుగు - అర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి - 2 రేకలు, ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత.
తయారుచేసే విధానం
కడాయిలో ఆలివ్ ఆయిల్ వేసి పాలకూర, ఉల్లి తరుగు, వెల్లుల్లి వేగించి కారం, ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. పిజ్జా బేస్‌ను 4 నిమిషాల పాటు వోవన్‌లో ఉంచి తియ్యాలి. ఆ తర్వాత అడుగున క్రీమ్ రాసి, పనీర్ తురుము చల్లి, పాలకూర మిశ్రమం సమానంగా పరచాలి. ఆపైన గుడ్ల సొన వేసి వోవెన్‌లో (200 డిగ్రీలు దగ్గర) 12 నిమిషాలు పెట్టాలి. బయటకి తీశాక పుదీనా తురుముతో అలంకరించి వేడి వేడిగా తినాలి.