గోంగూర జామ్‌

ABN , First Publish Date - 2015-08-30T19:12:36+05:30 IST

కావలసిన పదార్థాలు: గోంగూర కాయ రేకులు - 2 కప్పులు, పంచదార - రెండు కప్పులు.

గోంగూర జామ్‌

(గోంగూర ఆకులతోనే కాదు, కాయ(ఎరుపు) రేకులతో కూడా పచ్చడి, జామ్‌, షర్బత్‌ వంటి వంటలు చేసుకోవచ్చని కొందరికే తెలుసు. థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, మలేషియా లాంటి మన తూర్పు ఆగ్నేయ దేశాల్లో వీటితో అతి సులువుగా జామ్‌, షర్బత్‌లు చేస్తారు.)
కావలసిన పదార్థాలు: గోంగూర కాయ రేకులు - 2 కప్పులు, పంచదార - రెండు కప్పులు.
తయారుచేసే విధానం: గోంగూర కాయ రేకులు వలిచి వేడి నీటిలో కొద్దిసేపు ముంచాలి. దీనివలన కనిపించని క్రిములుంటే చనిపోతాయి. తర్వాత నీడలో ఆరబెట్టి మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దలో పంచదార కలిపి కడాయిలో సన్నమంటపై ఉడికించాలి. ముందుగా తెల్లని బుడగలు కనిపిస్తాయి. నెమ్మదిగా బుడగలు పోయి పాకం చిక్కబడుతుంది. ఇప్పుడు దించేసి వేడి చల్లారి, గోరువెచ్చగా ఉన్నప్పుడే పొడి సీసాలో నింపి మూతపెట్టి ఫ్రిజ్‌లో భద్ర పరచాలి. ఈ తీపి పులుపు జామ్‌ బ్రెడ్‌పై రాసుకుంటే కమ్మగా ఉంటుంది. చేసి చూడండి.

Updated Date - 2015-08-30T19:12:36+05:30 IST