పచ్చి మామిడి జూస్‌

ABN , First Publish Date - 2015-08-31T18:53:53+05:30 IST

కావలసిన పదార్థాలు: పుల్ల మామిడికాయ - (పెద్దది)1, నల్ల ఉప్పు - పావు టీ స్పూను, పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు

పచ్చి మామిడి జూస్‌

కావలసిన పదార్థాలు: పుల్ల మామిడికాయ - (పెద్దది)1, నల్ల ఉప్పు - పావు టీ స్పూను, పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు, వేగించిన జీలకర్ర పొడి - పావు టీ స్పూను, మెదిపిన మిరియాలు - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: మామిడికాయకు తగినంత నీటిని చేర్చి మెత్తగా ఉడికించాలి. చల్లార్చి తొక్క, టెంక తీసేసి బాగా మెదిపి, ఆ గుజ్జుకి 4 గ్లాసుల నీరుని జతచేయాలి. తర్వాత నల్ల ఉప్పు, పంచదార, జీలకర్రపొడి, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. తాగేముందు వడకట్టి ఐస్‌ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది.

Updated Date - 2015-08-31T18:53:53+05:30 IST