చీజ్‌ బాల్స్‌

ABN , First Publish Date - 2015-08-30T18:14:49+05:30 IST

కావల్సినవి: జున్ను - 200 గ్రాములు, మైదా - 200 గ్రాములు, కోడిగుడ్డు - 1, బేకింగ్‌పౌడర్‌ - 1 టేబుల్‌ స్పూన్‌

చీజ్‌ బాల్స్‌

కావల్సినవి: జున్ను - 200 గ్రాములు, మైదా - 200 గ్రాములు, కోడిగుడ్డు - 1, బేకింగ్‌పౌడర్‌ - 1 టేబుల్‌ స్పూన్‌, పెప్పర్‌పౌడర్‌ - 1 టేబుల్‌స్పూన్‌, వెన్న - 50 గ్రాములు, నెయ్యి - 1 టేబుల్‌స్పూన్‌, నూనె - ఫ్రై చేయడానికి తగినంత
విధానం:
జున్నును గరిటతో బాగా చిదమాలి. మైదా, జున్ను, కోడిగుడ్డు, బేకింగ్‌ పౌడర్‌, నెయ్యి, పెప్పర్‌పౌడర్‌ వేసి ముద్దగా కలపాలి. వెన్న వేసి పిండి మృదువుగా అయ్యేలా కలుపుకోవాలి. తడిపిన కాటన్‌క్లాత్‌లో ఈ పిండిని చుట్టి పదిహేను నిమిషాలు ఉంచాలి. తర్వాత ఈ పిండిని సమభాగాలుగా చేసి బాల్స్‌లా తయారుచేసుకోవాలి. తగినంత నూనెపోసి వేడిచేసి సన్నని సెగమీద ఈ బాల్స్‌ని దోరగా వేయించుకోవాలి. కొత్తిమీర ఆకులను, టొమాటో ముక్కలను అలంకరణకు ఉపయోగించుకోవచ్చు. 

Updated Date - 2015-08-30T18:14:49+05:30 IST