థాయ్‌ ఫ్రైడ్‌ హాఫ్‌ బాయిల్డ్‌ ఎగ్స్‌

ABN , First Publish Date - 2016-06-14T18:16:33+05:30 IST

వేగించిన ఉల్లి తరుగు- 1/2 కప్పు, నూనె- 1 టేబుల్‌ స్పూను, హాఫ్‌ బాయిల్డ్‌ గుడ్లు- 4, టమోట సాస్‌- 2 టీ స్పూన్లు, చిల్లీ సాస్‌- 1/2 టీ స్పూను, వెనిగర్‌- 1/4 టీ స్పూను, నీళ్ళు- 3 టీ స్పూన్లు,

థాయ్‌ ఫ్రైడ్‌ హాఫ్‌ బాయిల్డ్‌ ఎగ్స్‌

కావలసిన పదార్థాలు: వేగించిన ఉల్లి తరుగు- 1/2 కప్పు, నూనె- 1 టేబుల్‌ స్పూను, హాఫ్‌ బాయిల్డ్‌ గుడ్లు- 4, టమోట సాస్‌- 2 టీ స్పూన్లు, చిల్లీ సాస్‌- 1/2 టీ స్పూను, వెనిగర్‌- 1/4 టీ స్పూను, నీళ్ళు- 3 టీ స్పూన్లు, క్యాప్సికం తరుగు- 1/2 కప్పు, కొత్తిమీర తరుగు- 1 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా
తయారీ విధానం: ఒక బాణలిలో నూనె వేసి దానిలో గుడ్లు దోరగా వేగించి తీసి, సగానికి ముక్కలుగా కోసి సర్వింగ్‌ ప్లేట్‌లో ఉంచుకోవాలి. తరవాత ఆ బాణలిలోనే క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిసేపు వేగించి తీసేసి టమోట సాస్‌, చిల్లీ సాస్‌, వెనిగర్‌ వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించాలి. తరువాత నీళ్ళు పోసి కొద్దిగా జారుగా చేసి ఉప్పు కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ప్లేటులోని ముక్కలపై పోసి ఉల్లి తరుగు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర తరుగు జల్లాలి.

Updated Date - 2016-06-14T18:16:33+05:30 IST