కీర-పల్లీ సలాడ్‌

ABN , First Publish Date - 2017-04-08T20:40:46+05:30 IST

కావాల్సిన పదార్థాలు కీర : కిలో చక్కెర: ఒక టీస్పూను ఉప్పు తగినంత

కీర-పల్లీ సలాడ్‌

కావాల్సిన పదార్థాలు
కీర : కిలో
చక్కెర: ఒక టీస్పూను
ఉప్పు తగినంత
తురిమిన కొబ్బరి:1/2 కప్పు
ఉప్పులేని రోస్టెడ్‌ పల్లీలు:1/2 కప్పు
నిమ్మకాయ రసం
తాలింపులోకి :నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు
నల్ల ఆవాలు: ఒక టీ స్పూన్‌
ఇంగువ : చిటికెడు
పచ్చిమిరపకాయలు: 4 (సన్నగా తరిగి)
 
 
తయారీ విధానం
 
కీర తొక్క తీసి ముక్కలుగా చేసి ఒక బౌల్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. అవి చల్లబడిన తర్వాత బయటకు తీసి బౌల్‌లో చేరిన నీరు తీసేయాలి. ఒక గిన్నెలో చక్కెర, కొబ్బరి తురుము వేసి అందులో కీర ముక్కల్ని వేసి బాగా కలపాలి. తర్వాత ఒక బాండిలో నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, ఇంగువ, పచ్చిమిరపకాయముక్కలు వేయాలి. అది చల్లారిన తర్వాత దానిని కీర ముక్కల మీద పోయాలి. అందులో నిమ్మరసం, పల్లీలు, ఉప్పు వేసి బాగా కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2017-04-08T20:40:46+05:30 IST