బాదం చెర్రీ కేక్‌

ABN , First Publish Date - 2015-10-16T14:18:37+05:30 IST

కావలసిన పదార్థాలు: గట్టి పాలు: ముప్పావు లీటరు, మైదాపిండి: అరకిలో, చక్కెర పొడి: 150 గ్రాములు, బాదంపప్పు

బాదం చెర్రీ కేక్‌

కావలసిన పదార్థాలు: గట్టి పాలు: ముప్పావు లీటరు, మైదాపిండి: అరకిలో, చక్కెర పొడి: 150 గ్రాములు, బాదంపప్పు: 150 గ్రాములు, ఎండు చెర్రీలు:150 గ్రాములు(ముక్కలుగా చేసుకోవాలి), బేకింగ్‌ పౌడర్‌: నాలుగు టేబుల్‌ స్పూన్లు, వంటసోడా: ఒకటిన్నర స్పూను, వెన్న: పావుకిలో, వేడిపాలు: నాలుగు కప్పులు, ఆల్‌మండ్‌ ఎసెన్స్‌: టేబుల్‌ స్పూను.
తయారీ విధానం: బాదంపప్పులను కొద్దిసేపు వేడినీటిలో వేసి పైన తొక్క తీసి ముక్కలుగా చేసుకోవాలి. మైదా, బేకింగ్‌ పౌడర్‌, వంటసోడా ఒక గిన్నెలో వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వెన్నలో చక్కెర పొడి వేసి మృదువుగా అయ్యే వరకూ గిలక్కొట్టువాలి. ఇందులోనే ఆల్మండ్‌ ఎసెన్స్‌ కూడా కలిపి వుంచుకోవాలి. గట్టిపాలను నెమ్మదిగా పోస్తూ వెన్నలో కలిసేటట్టు స్పూనుతో కలుపు కోవాలి. ఇప్పుడు ముక్కలుగా చేసి పెట్టుకున్న బాదం పప్పులను కూడా జతచేసుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా కలిపిపెట్టుకున్న మైదాపిండిని కలుపు కుంటూ అవసరం అనుకుంటే వేడిపాలు కొద్ది కొద్దిగా పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ డిష్‌లోకి మార్చి ఓవెన్‌లో నలభై నిమిషాల పాటు బేకింగ్‌ చేసుకోవాలి. చల్లారిన తరువాత సర్వ్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2015-10-16T14:18:37+05:30 IST