మటన్‌ ఇష్టూ

ABN , First Publish Date - 2017-11-11T18:07:10+05:30 IST

మటన్‌ - 500గ్రా, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు - ఒక్కోటి రెండు చొప్పున, లవంగాలు - ఐదు...

మటన్‌ ఇష్టూ

కావాల్సినవి
 
మటన్‌ - 500గ్రా, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు - ఒక్కోటి రెండు చొప్పున, లవంగాలు - ఐదు, అల్లం - చిన్న ముక్క, పచ్చి మిర్చి - మూడు, కొబ్బరి పాలు - రెండు కప్పులు, కొబ్బరి నూనె - ఒక టేబుల్‌ స్పూన్‌, జీడిపప్పు - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారివిధానం
 
ముందుగా మటన్‌ ముక్కలు ఉడికించాలి. మరొక పాత్రలో బంగాళదుంపలు ఉడికించాలి. పాన్‌లో కొబ్బరినూనె వేడిచేసి లవంగాలు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి. తరువాత ఉడికించిన బంగాళా దుంపలను మెత్తగా చేసి వేసి, మటన్‌ ముక్కలను కూడా వేసి కలపాలి. కాసేపు ఉడికాక కొబ్బరిపాలు పోసి కలపాలి. పాలు కొంచెం చిక్కబడ్డాక జీడిపప్పు గ్రైండ్‌ చేసి వేయాలి. తరువాత ఉప్పు వేసి మరికాసేపు ఉడికించాలి. వేడి వేడిగా తింటే బాగుంటుంది.

Updated Date - 2017-11-11T18:07:10+05:30 IST